అసెంబ్లీలో మాజీ సీఎంకు ఘోర అవమానం.. మాట్లాడుతుండగా ఊడిన పంచె

by  |
Congress leader Siddaramaiah
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలు అంటేనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం, అధికార మంత్రులు, ఎమ్మెల్యేలు జవాబులివ్వడం జరుగుతుంటాయి. పరిస్థితి ముదిరితే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటారు. అంతేగాకుండా.. అసెంబ్లీ సాక్షిగా అనేకసార్లు ప్రజాప్రతినిధులు గొడవలు పడిన సంఘటనలు, దాడులు చేసుకున్న సందర్భాలూ అనేకం ఉన్నాయి. అయితే.. అంతవేడిగా ఉండే అసెంబ్లీలో ఒక ఫన్నీ ఇన్నిడెంట్ జరిగితే భలే సరదాగా ఉంటుంది. మరో అరగంట పాటు నేతలందరూ దానిపైనే చర్చిస్తుంటారు. తాజాగా.. అలాంటి ఆసక్తికర ఘటనే కర్ణాటక శాసన సభలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో అప్పటివరకు వాడివేడీగా అధికార, విపక్ష నేతల చర్చ జరిగింది. సభలో ఎమ్మెల్యేలు మంత్రులుందరూ చాలా గంభీరంగా ఉన్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రసగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన పంచె జారిపోయింది. ఈ విషయాన్ని ఇతర సభ్యులతో పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ గమనించారు. దీంతో సిద్ధరామయ్య దగ్గరకు వెళ్లి పంచె జారిపోతున్న విషయాన్ని వెల్లడించారు. దాంతో సిద్ధరామయ్య తన పంచెను సరి చేసుకున్నారు. మైకును గమనించకుండా పంచె సరిచేస్తూ ఫన్నీగా మాట్లాడేసరికి అసెంబ్లీలో మొత్తం నవ్వులు చిగురించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed