పాకిస్థానీలు చాలా మంచోళ్లు..ఇండియా వాళ్లు నన్ను ద్వేషిస్తారు..ప్రముఖ యూట్యూబర్ సంచలన పోస్టు!

by Ajay Maddhiboyina |

ప్ర‌ముఖ హిందీ యూట్యూబ‌ర్ ర‌న్వీర్ అల్లబాడియా మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవ‌లే ఓ టీవీలో ర‌న్వీర్ డార్క్ కామెడీ చేసి పోలీసు కేసుల‌ను సైతం ఎదుద్కొన్నారు.

పాకిస్థానీలు చాలా మంచోళ్లు..ఇండియా వాళ్లు నన్ను ద్వేషిస్తారు..ప్రముఖ యూట్యూబర్ సంచలన పోస్టు!
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ముఖ హిందీ యూట్యూబ‌ర్ ర‌న్వీర్ అల్లబాడియా మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవ‌లే ఓ టీవీలో ర‌న్వీర్ డార్క్ కామెడీ చేసి పోలీసు కేసుల‌ను సైతం ఎదుద్కొన్నారు. కాగా తాజాగా ఇండియా పాకిస్థాన్ యుద్ధంపై చేసిన పోస్టుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఇరు దేశాలు కాల్పుల ఒప్పందం చేసుకున్న త‌ర‌వాత ర‌న్వీర్ త‌న పోస్టులో..డియ‌ర్ పాకిస్థానీ బ్ర‌ర‌త్స్ అండ్ సిస్ట‌ర్స్ నేను ఈ పోస్టు చేసినందుకు భార‌తీయుల నుండి విమ‌మ‌ర్శ‌లు ఎదుర్కొంటాను. కానీ ఇది చెప్ప‌డం చాలా ముఖ్యం.

చాలా మంది భార‌తీయుల్లానే నాకు కూడా మీపై ద్వేషం లేదు. మ‌నలో చాలా మందికి శాంతి ముఖ్యం. నేను ఎప్పుడైనా పాకిస్థానీల‌ను క‌లిసిన‌ప్పుడు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. కానీ మీ దేశం ప్ర‌భుత్వం ఆర్మీ ఆధారంగా ప‌నిచేస్తుంది. అంతే కాకుండా మీ సీక్రెట్ స‌ర్వీస్ ఐఎస్ఐ ఆధారంగా పనిచేస్తుంది. ఒక సాధార‌ణ పాకిస్థానీ వేరు ఇవి రెండూ వేరు. సాధార‌ణ పాకిస్థానీ పౌరుడు శాంతి కోరుకుంటాడు.

కానీ ఈ ఇద్ద‌రు విల‌న్స్ మీ ఆర్థిక‌స్వేచ్చ‌ను బాధిస్తూనే ఉంటారు. ఇండియాలో తీవ్ర‌వాద‌దాడుల‌కు కూడా వాళ్లే కార‌ణం.. అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇది భార‌తీయుల‌కు పాకిస్థానీయుల‌కు మ‌ధ్య యుద్దం కాద‌ని, ఇది భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ ఆర్మీ మ‌రియు ఐఎస్ఐ మ‌ధ్య‌ యుద్దం అని పేర్కోన్నారు. ర‌న్వీర్ చేసిన పోస్టుపై ఇన్ స్టాగ్రామ్ లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పాకిస్థానీయుల‌ను అంత పొగుడుతూ పోస్టు చేయ‌డంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాకిస్థాన్ వాళ్లు భారత్ పై విషం చిమ్ముతూ ఉంటే ఫాలోవర్ల కోసమమే ఇలా చేశావా అంటూ మండిపడ్డారు. దీంతో వెంట‌నే త‌న పోస్టును ర‌న్వీర్ డిలీట్ చేశాడు. గతంలో ఈ యూట్యూబర్ ప్రధాని మోడీ చేతులమీదుగా అవార్డు సైతం అందుకున్నారు.

Next Story