- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vyomika Singh: ఎవరు ఈ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్?
ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. వాళ్లే కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిర్వహించింది. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని ప్రపంచానికి తెలిసేలా ప్రకటనలు చేసి.. ఏం జరుగుతుందో పాక్ గ్రహించేలోగానే దెబ్బకొట్టింది ఇండియన్ ఆర్మీ (Indian Army). భారత్ మెరుపు దాడులపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. వాళ్లే కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.
వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh)కు.. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలన్న కోరిక ఉండేది. స్కూల్ డేస్ లోనే ఎన్ సీసీలో చేరిన ఆమె.. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో హెలికాప్టర్ పైలట్ గా ప్రొఫెషనల్ లైఫ్ ను స్టార్ట్ చేశారు. 2019, డిసెంబర్ 18న ఫ్లయింగ్ బ్రాంచ్ లో పర్మినెంట్ కమిషన్ హోదా పొందారు. జమ్మూకశ్మీర్, నార్త్ ఈస్ట్ ఇండియాలోని ఎత్తయిన ప్రాంతాలతో పాటు, సవాలుతో కూడిన ప్రాంతాల్లోనూ చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపి, కొన్ని రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. నవంబర్ 2020లో ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లో కఠినమైన వాతావరణం, ఎత్తైన ప్రదేశాలలో నావిగేట్ చేస్తూ కీలకమైన రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించింది. 2021లో, సింగ్ 21,650 అడుగుల హిమాలయ శిఖరం అయిన మౌంట్ మణిరాంగ్‌కు త్రి-సేవల పూర్తి మహిళల యాత్రలో పాల్గొన్నారు. అటువంటి మిషన్లలో ఆమె భాగస్వామ్యాన్ని సీనియర్ రక్షణ నాయకత్వం గుర్తించింది.






