India-Pakistan War: జమ్మూకశ్మీర్‌లో నేటి ఉదయం పరిస్థితి ఎలా ఉందంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-09 04:47:31  IST  )

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం (India-Pakistan war) నడుస్తోంది.

India-Pakistan War: జమ్మూకశ్మీర్‌లో నేటి ఉదయం పరిస్థితి ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం (India-Pakistan war) నడుస్తోంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ భారత్‌పై వరుస దాడులకు పాల్పడింది. దాదాపు 15 నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్ల దాడి చేసింది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాలపై మొత్తం 50 డ్రోన్లను ప్రయోగించగా.. భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంది. అంతేకాదు, భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ చొరబాట్లపై గట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. అనేక పాకిస్తాన్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేశాయి. భారత ముమ్మర దాడులతో పాకిస్థాన్ నగరాలు కకావికలంగా మారాయి.

ఇన శుక్రవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి శాతంగానే కనిపిస్తోంది. అయితే, భారీ భద్రతా బలగాలు మోహరించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తత కొనసాగుతోంది. ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కలికంగా సెలవులు ప్రకటించారు. పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారత సైన్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రత్యుత్తరం అవసరమో తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉంది. స్థానికులు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారం కోసం మాత్రమే వేచిచూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Next Story