అణుబాంబును ప్రయోగించే ఉద్దేశం మాకు లేదు : పాక్ రక్షణ శాఖ మంత్రి

by Naga Rani Yarlagadda |

న్యూక్లియర్ వెపన్ ప్రయోగం అనేది చివరి ఆప్షన్ అని, ఆ దశ వరకూ వెళ్లాల్సిన అవసరం రాకుండానే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నట్లు

అణుబాంబును ప్రయోగించే ఉద్దేశం మాకు లేదు : పాక్ రక్షణ శాఖ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలు (India - Pakistan War) రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండురోజులుగా ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో పాక్ దాడులకు పాల్పడుతుండగా.. భారత సైన్యం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. భారత్ దెబ్బకు పాక్ యూటర్న్ (Pak Uturn) తీసుకుంది. మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అణుబాంబు ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉంది కానీ.. అందుకు ఇది సమయం కాదన్నారు. ఇంకా ఆ సమయం రాలేదని, అలాంటి సమయం రావాలని కూడా తాము కోరుకోవడం లేదన్నారు.

న్యూక్లియర్ వెపన్ ప్రయోగం అనేది చివరి ఆప్షన్ అని, ఆ దశ వరకూ వెళ్లాల్సిన అవసరం రాకుండానే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి దేశంలో నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం జరగలేదని, ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే పాక్ లో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుందన్నారు. యుద్ధం జరగడమే మార్గమైతే రక్షణ వ్యవస్థలో రెండవ వరుసలో మదర్సా విద్యార్థులు ఉంటారని ప్రకటించారు. అవసరమైతే వారిని యుద్ధంలో మోహరిస్తామన్నారు.

పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా.. భారత్ తమపై చేస్తున్న సైనిక దాడిని ఇక్కడితే ఆపితే తాము కూడా ఉద్రిక్తల్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యుద్ధ వాతావరణాన్ని తగ్గించుకునేందుకు ఢిల్లీతో చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్ రెడీగా ఉన్నట్లు పాక్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Next Story