పాక్ పై వార్.. సికింద్రాబాద్ నుంచి భారీగా తరలిన సైనికులు

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ దేశాన్ని మట్టికరిపించే ప్రయత్నం

పాక్ పై వార్.. సికింద్రాబాద్ నుంచి భారీగా తరలిన సైనికులు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ దేశాన్ని మట్టికరిపించే ప్రయత్నం చేస్తుంది ఇండియా. మరో ఐదారు గంటలు యుద్ధం జరిగితే ఖచ్చితంగా.. పాకిస్తాన్ భూస్థాపితం కావడం పక్కా అని చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో... బోర్డర్ లో ఉద్రిక్తతల ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి... ఆర్మీ అధికారులు, సైనికులు వెళ్తున్నారు.

బోర్డర్ లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు రెచ్చిపోతున్న నేపథ్యంలో... మరింత ఇండియన్ ఫోర్స్ కావాల్సి ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న భారత సైనికులు అందరూ జమ్మూ కాశ్మీర్ బార్డర్ కు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఇండియన్ సైనికులు... ప్రత్యేక వాహనాలలో తరలి వెళ్తున్నారు. సైనికులతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పాకిస్తాన్ అంతు చూసేందుకు పయనం అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉండగా... పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇంటి దగ్గరే... భారీ బాంబు పేలుడు జరిగింది. దీంతో ఇంటి నుంచి పారిపోయిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఓ బంకర్ లో దాక్కున్నాడని సమాచారం అందుతోంది. అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ విధ్వంసం దెబ్బకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

Next Story