- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India Pakistan War : కరాచీపై భారత్ దాడి వీడియో వైరల్.. ఫేక్ వీడియోలు ప్రచారం చేయవద్దన్న ఆర్మీ వర్గాలు
పహాల్గం ఉగ్రదాడి(Pahalgam Terror Attack), పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి.

దిశ, వెబ్ డెస్క్ : పహాల్గం ఉగ్రదాడి(Pahalgam Terror Attack), పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. గురువారం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ ఎటాక్ దిగగా.. భారత్ గట్టిగా బదులు ఇచ్చింది. అంతటితో ఆగకుండా పాక్ పై ప్రతిదాడికి దిగింది. పాక్ కీలక నగరాలైన ఇస్లామాబాద్(Islamabad), లాహోర్(Lahor) పై వైమానిక దాడులు, మిస్సైల్స్ తో విరుచుకు పడింది. కరాచీ పోర్టు(Karachi Port)ను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే భారత్ మిసైల్ దాడి చేయడం వలన కరాచీలోని జిన్నా మార్కెట్ రోడ్డు కాలి పోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... అది ఫేక్ వీడియో అని ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆ వీడియో కరాచీది కాదని గతంలో ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ ప్లేన్ క్రాష్ విజువల్స్ అని ఫ్యాక్ట్ చెక్ వర్గాలు తేల్చాయి. నెట్టింట్లో ఫేక్ వీడియోలు ప్రసారం చేసే ముందు కేంద్ర మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో చెక్ చేయమని సూచించింది.






