చార్‌ధామ్ యాత్ర హెల్ప్ లైన్ నంబర్లు

by velandi.Saikiran |   (  Updated:2025-05-10 11:41:32  IST  )

చార్‌ధామ్ యాత్రపై ( chardam yatra) ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ( Uttarakhand CM Pushkar Singh Dhami ) కీలక ప్రకట

చార్‌ధామ్ యాత్ర హెల్ప్ లైన్ నంబర్లు
X

దిశ, వెబ్ డెస్క్: చార్‌ధామ్ యాత్రపై ( chardam yatra) ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ( Uttarakhand CM Pushkar Singh Dhami ) కీలక ప్రకటన చేశారు. చార్‌ధామ్ యాత్ర సాఫీగా సాగుతోంది.. ప్రజలు ఎలాంటి రూమర్లు నమ్మొద్దని ఈ సందర్బంగా కోరారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఇప్పటి వరకు 4 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారన్నారు.

కేదార్‌నాథ్ యాత్రకు ( Kedarnath Yatra ) కూడా అన్ని సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. ఇతర వివరాలకు హెల్ప్ లైన్ నంబర్లు 1364 లేదా 0135-1364 సంప్రదించండి అని కోరారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... చార్ దామ్ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడిందని... ఇవాళ ఉదయం నుంచి వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో జనాలంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. మొన్ననే ప్రారంభమైన ఈ యాత్ర... సాఫీగానే కొనసాగుతుందని తాజాగా సీఎం పుష్కర సింగ్ క్లారిటీ ఇచ్చారు.

Next Story