అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మనదే విజయం: యూపీ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-09 05:35:07  IST  )

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మనదే విజయమని యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు..

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మనదే విజయం: యూపీ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అప్పుడు.. ఇప్పుడు.. మనదే విజయం అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్(Operation Sindoor), పాక్ డ్రోన్ దాడులపై ఆయన స్పందించారు. పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మందికి కారణకులయ్యారు. ఇందుకు భారత సైన్యం దీటుగా సమాధానం చెబుతోంది. మన బలగాలను ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాలి. అప్పుడే జవాన్లలో మనోధైర్యం పెరుగుతుంది. పాకిస్థాన్ ప్రపంచం ముందు మూలుగుతున్నట్లు నటిస్తోంది. భారత్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తోంది. ప్రధాని మోడీ ర్గంలో భారతీయులందరూ నడవాలి. భారత దేశం ప్రతీ విషయంలోనూ భారత్ విజయం సాధించింది. ఇక ముందు కూడా విజయాల పరంపరను కొనసాగిస్తుంది.’’ అని సీఎం యోగి పేర్కొన్నారు.

Next Story