- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ నుంచి గోలీ వస్తే.. ఈసారి భారత్ నుంచి మిస్సైల్ వెళ్తుంది.. అమెరికాకు క్లియర్‌గా చెప్పిన మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)కి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(US Vice President JD Vance) ఫోన్ చేశారు. భారత్ - పాక్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తలపై సుదీర్ఘంగా చర్చించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)కి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(US Vice President JD Vance) ఫోన్ చేశారు. భారత్ - పాక్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తలపై సుదీర్ఘంగా చర్చించారు. కాల్పుల విరమణ దిశగా ఒప్పించేందుకు తాము సిద్ధమని వాన్స్ మోడీకి వివరించారు. దీనికి మోడీ ప్రతి స్పందిస్తూ.. మరోసారి నిబంధనలు ఉల్లంఘించి పాక్ కాల్పులు జరిపితే.. తాము మౌనంగా ఉండబోమని.. ధీటుగా బదులిస్తామని జేడీ వాన్స్‌కు ప్రధాని మోడీ చెప్పారు. మా సంయమనం బలహీనత కాదని.. భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ప్రధాని మోడీ క్లియర్‌గా చెప్పారు.
ఇదిలా ఉండగా.. సోమవారం భారత్-పాక్ మధ్య హాట్లైన్లో కాల్పుల విరమణపై చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో రెండు దేశాల మిలటరీ ఆపరేషన్స్ అధికారులు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గించడం.. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కాల్పుల విరమణపై శనివారం భారత్-పాక్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
మరోవైపు.. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. మళ్లీ పాక్ కాల్పులకు తెగబడితే.. ధీటుగా స్పందించాలని ఆర్మీని ఆదేశించారు. అటు నుంచి గోళీ మన దేశంలోకి వస్తే.. ఇటు నుంచి మిస్సైల్స్‌ను వదలండి అని ఆదేశించారు.






