- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్‌లో ఇద్దరు టర్కీ డ్రోన్ ఆపరేటర్లు మృతి
పహల్గామ్ ఘటన తరవాత భారత్ పాకిస్థాన్ ఉగ్రశిభిరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ భారత సరిహద్దు నగరాలపై డ్రోన్ దాడులు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఘటన తరవాత భారత్ పాకిస్థాన్ ఉగ్రశిభిరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ భారత సరిహద్దు నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు అన్నీ టర్కీ దేశం నుండి కొనుగోలు చేయడంతో ఆ దేశంపై భారత్ మండిపడుతోంది. ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ పూర్తి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది.
దాదాపు 350కి పైగా డ్రోన్లు సప్లై చేయడంతో పాటూ వాటిని ఎలా ఉపయోగించాలో కూడా పాకిస్థాన్ ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు వచ్చిన ఇద్దరు టర్కీ మిలటరీ డ్రోన్ ఆపరేటర్లు కూడా ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయినట్టు సమాచారం. అయితే పాక్‌కు టర్కీ డ్రోన్లు పంపి సాయం చేసినప్పటికీ భారత డిఫెన్స్ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా ఎదుర్కుని రెండు దేశాలకు బుద్ది చెప్పింది. వచ్చిన డ్రోన్లు అన్నిటినీ డిఫెన్స్ వ్యవస్థ నాశనం చేయడంతో భారత్ శక్తి గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి.






