పాకిస్థాన్ సైనికులపై TTP తిరుగుబాటు దారుల మెరుపు దాడి !

by velandi.Saikiran |

భారత్ ను ( India) గెలికిన పాకిస్తాన్ కు ( Pakisthan ) వరుసగా ఎదురు దెబ్బ తగులుతున్నాయి. భారత్ చేసే దాడికి ప్రతి దాడి చేయ

పాకిస్థాన్ సైనికులపై TTP తిరుగుబాటు దారుల మెరుపు దాడి !
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ ను ( India) గెలికిన పాకిస్తాన్ కు ( Pakisthan ) వరుసగా ఎదురు దెబ్బ తగులుతున్నాయి. భారత్ చేసే దాడికి ప్రతి దాడి చేయలేక... చేతులెత్తేస్తోంది పాకిస్తాన్. ఇలాంటి నేపథ్యంలోనే.. పాకిస్తాన్ దేశాన్ని టార్గెట్ చేసి మరి.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( Balochistan Liberation Army) రెచ్చిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ సైనికులను చాలా మందిని చంపిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ... స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని తమ జెండాను కూడా ఎగర వేసుకుంది.

దానికి తోడు పాకిస్తాన్ లో తాజాగా భూకంపం కూడా వచ్చింది. ఇది వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుంద నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు తాజాగా TTP రెబల్స్ తిరుగుబాటు చేశారు. పాకిస్తాన్ దేశంలో వేర్పాటు వాదులుగా ఉన్న...TTP రెబల్స్.. తాజాగా పాకిస్తాన్ సైనికుల పై దాడి చేసినట్లు... జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇండియాతో యుద్ధం చేస్తున్న పాకిస్తాన్... సొంత దేశంలో ఉన్న శత్రువులను పట్టించుకోవడం లేదు. దీంతో బలూచిస్తాన్ అలాగే ఇప్పుడు TTP రెబల్స్ రెచ్చిపోయారు. పాకిస్తాన్ సైనికులపై వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ ప్రాంతంలో దాడి చేశారు. ఈ సంఘటనలో పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఒంటరైన పాకిస్తాన్... ఏమీ చేయలేక.. చేతులెత్తేస్తుందని చెబుతున్నారు.


Next Story