- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: జవాన్ మురళీ నాయక్ వీర మరణం.. కన్నతల్లి అరణ్యరోదన (వీడియో వైరల్)
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారత నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ సైన్యం భారత పోస్టులపై కాల్పులతో విరుచుకుపడుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జవాన్ మురళీ నాయక్ తీవ్ర బుల్లెట్ గాయాలతో యుద్ధ రంగంలోనే వీర మరణం పొందారు. అతడి స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లి తండా. అయితే, మురళీ నాయక్ పార్థివ దేహం రేపు ఉదయం స్వగ్రామానికి రానుండగా.. సైనిక లాంఛనాలతో అతడి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు.
కొడుకు మరణ వార్త తెలిసిన తల్లి, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ముఖ్యంగా మురళీ నాయక్ అమ్మ, అల్లారుముద్దుగా కని పెంచిన ఒకే ఒక్క కొడుకు అకాల మరణాన్ని తట్టుకోలేక గుండెలు అవిసేలా రోదిస్తున్నది. మళ్లీ తన కొడుకును చూడలేనంటూ ఇంటికి వచ్చిన బంధువులను పట్టుకుని విలపిస్తున్నది. అయితే, ఆమె కన్నీరును ఎవరూ ఆపతరం కావడం లేదు. తమ గ్రామం నుంచి దేశ రక్షణకు వెళ్లిన యువకుడు ఇలా విగత జీవిగా తిరిగిరావడం పట్ల కల్లితండా గ్రామస్థులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారుజ ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






