దాయాది పాక్‌కు నేడు కాళరాత్రే.. త్రివిధ దళాలకు రాజ్‌నాథ్ సింగ్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-08 17:09:57  IST  )

ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా దాయాది పాక్ భారత్‌లోని పలు ప్రాంతాల్లో వరస దాడులకు పాల్పడుతోంది.

దాయాది పాక్‌కు నేడు కాళరాత్రే.. త్రివిధ దళాలకు రాజ్‌నాథ్ సింగ్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా దాయాది పాక్ భారత్‌లోని పలు ప్రాంతాల్లో వరస దాడులకు పాల్పడుతోంది. గురువారం రాత్రి జమ్ము వర్సిటీ సమీపంలో పాక్ ప్రయోగించిన 2 డ్రోన్ల బాంబులను భారత భద్రతా దళాలు కూల్చివేశాయి. పంజాబ్‌లోని జలంధర్‌లోనూ మిస్సైల్స్‌తో విరుచుకు పడింది. ఇక ఉదంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్, కథువా, రాజౌరి, అమృత్‌సర్ ప్రాంతాల్లో దాడులకు తెగబడింది. ఇక ప్రముఖ వైష్ణోదేవి ఆలయంపైకి డ్రోన్ దాడికి కూడా యత్నించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కచ్, బుజ్, మోహాలీ, చండీగఢ్‌లో బ్లాక్ అవుట్ ప్రకటించింది. అయితే, ఇవాళ పాకిస్థాన్‌కు కాళరాత్రి కాబోతోంది. కాల్పులను సీరియస్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హుటాహుటిన త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. పాక్ కాల్పులకు సరైన సమాధానం చెప్పాలంటూ ఆయన భద్రతా దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా 9.55 నిమిషాలకు ఇండియన్ ఆర్మీ లాహోర్‌, సియోల్‌కోట్‌‌లపై ఆఫీషియల్‌గా అటాక్‌ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోడీతో భేటీ అయి తాజా పరిస్థితిని ఆయనకు విరించనున్నారు. తెల్లవారేసరికి ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Next Story