- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tiranga Yatra : రేపు హైదరాబాద్‌లో తిరంగ యాత్ర
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సక్సెస్ అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన 'తిరంగ యాత్ర'(BJP Tiranga Yatra) రేపు హైదరాబాద్(Hyderabad) లో జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సక్సెస్ అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన 'తిరంగ యాత్ర'(BJP Tiranga Yatra) రేపు హైదరాబాద్(Hyderabad) లో జరగనుంది. హైదరాబాద్‌లో రేపు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్‌బండ్(Tank Bund) వద్ద BJP ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహించబడుతుంది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ BJP అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి(Kishan Reddy), జమ్మూ కాశ్మీర్ DGP, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రిటైర్డ్ IPS, DGP ర్యాంక్ అధికారులు, సైనిక అధికారులు, రక్షణ సిబ్బంది, కళాకారులు, బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దేశభక్తి నినాదాలు, సైన్యానికి మద్దతుగా కార్యక్రమాలు జరపనున్నట్టు కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరంగ యాత్రలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన ఆహ్వానం పలికారు. కాగా ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.






