ఈ దాడి ఇరు దేశాల మధ్య తీవ్రతను పెంచేందుకు కాదు.. Sofiya Qureshi

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 06:21:36  IST  )

ఇండియన ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇరు దేశాల మధ్య తీవ్రతను పెంచేందుకు కాదని కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు.

ఈ దాడి ఇరు దేశాల మధ్య తీవ్రతను పెంచేందుకు కాదు.. Sofiya Qureshi
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇరు దేశాల మధ్య తీవ్రతను పెంచేందుకు కాదని కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు. ఇవాళ ఢిల్లీలో ‘ఆపరేషన్ సిందూర్’‌పై త్రివిధ దళాధిపతులతో కలిసి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ఉగ్రమూకలు దేశంలో సృష్టించిన మారణకాండపై పలు వీడియోలను ప్రదర్శించారు. అనంతరం కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ ఇరు దేశాల మధ్య తీవ్రతను పెంచేందుకు కాదని స్పష్టం చేశారు పహల్గాం కుట్రదారులను ఆధారాలతో సహా కనుగొన్నామని.. అదేవిధంగా వారికి ఆర్థికంగా సాయం అందజేస్తున్న వారిని కూడా గుర్తించామని పేర్కొన్నారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడిన వారిని కచ్చితంగా శిక్షిస్తామని అన్నారు. పహల్గాం మృతులకు న్యాయం జరిగేంత వరకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని పాక్‌లోని సవాల్ నాలా నుంచి బహావల్‌పూర్ వరకు వైమానికి దాడులు చేశామని పేర్కొన్నారు. అక్కడున్న పౌర స్థావరాలకు ఎలాంటి నష్టం కలుగకుండా దాడులు జరిగాయని సోఫియా ఖురేషి తెలిపారు.

పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

ఎల్‌వోసీ (LOC) నుంచి 30 కి.మీ దూరంలో కోట్లీ, బర్నాలపై దాడి చేశామన్నారు. అదేవిధంగా సియాల్‌కోట్‌లోని సర్జల్, మెహమూనా జాయా సియాల్‌కోట్‌పై మిసైల్స్ ప్రయోగించామని అన్నారు. ఇక కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలను సమర్థవంతంగా ఛేదించామని తెలిపారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడి చేశామని, పాక్ సైనిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు. పాక్ చర్యలను ఎదుర్కొనేందుకు భారత దళాలు సన్నద్ధంగా ఉన్నాయని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్కొన్నారు.

Next Story