- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవ్వింపు చర్యలకు పాల్పడితే తగ్గేదే లేదు.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై కేంద్రం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కాసేపటి క్రితం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై కేంద్రం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. సమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో భారత సైన్యం పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై ఏవిధంగా వైమానిక దాడులు చేసిందో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని పార్టీల నాయకులకు వివరించారు. ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఇరు దేశ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఆపరేషన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వెల్లడించలేకపోతున్నామని తెలిపారు. అదేవిధంగా LOC వెంట నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా వారికి వివరించారు. ఒకవేళ పాక్ భారత్‌పై ఎదురుదాడి చేస్తే.. ఏ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని మళ్లీ ‘ఆపరేషన్ సిందూర్’ను మొదలు పెడతామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.






