- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LOC వెంట పరిస్థితి మరింత ఉద్రిక్తం.. భారత పోస్టులపై పాక్ కాల్పులు
పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంట పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంట పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ (Pakistan) సైన్యం కాల్పుల మోత మోగిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆ కాల్పులకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటైన సమాధానం చెబుతోంది. ఇక ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత సరిహద్దు ప్రాంతాలైన కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సామాన్య ప్రజలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.
ఈ ఘటనలో దాదాపు 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 43 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆర్మీ అధికారులు తెలిపింది. పాక్ సైన్యం దాడులతో ఇండ్లు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానికి దాడులు ప్రారంభించిన కాసేపటికే పాక్, భారత సరిహద్దులోని పౌరులపై కాల్పులు జరిపినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆకస్మిక పరిణామంతో ఎల్‌వోసీ (LOC) వెంట ఉన్న ప్రజలు ప్రాణ భయంతో కొందరు బంకర్లలో తలదాచుకోగా.. మరికొందరు ఆ ప్రాంతాన్ని వదిలి మరోచోటికి తరలివెళ్లారు.






