- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ ఎదురుదాడితో టెన్షన్.. పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసర భేటీ
దాయాది పాక్ దాడికి కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ గట్టిగానే బుద్ధి చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాక్ దాడికి కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ గట్టిగానే బుద్ధి చెప్పింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌లోని రావల్పిండి సమీపంలోని ఉన్న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్, చక్వాలాలోని మురీద్ ఎయిర్‌బేస్, షార్కోట్ రఫాక్ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం మిస్సైల్ అటాక్ చేసింది. అయితే, ఈ దాడులను పాక్ సైనిక ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే భారత్ దెబ్బకు కుదేలైన పాకిస్థాన్ అణుయుద్ధం పేరుతో బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు కాసేపట్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, నేషనల్ కమాండ్ అథారిటీ అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. కాగా, నేషనల్ కమాండ్ అథారిటీ అనేది దేశ అణ్వాయుధ నిల్వలు, భద్రతా నిర్ణయాలు తీసుకునే పౌర మరియు సైనిక అధికారుల అత్యున్నత సంస్థ. ఇందులో ప్రధాన మంత్రి నేతృత్వంలోని రాజకీయ మండలి, జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కార్యనిర్వాహక కమిటీలు ఉంటాయి.






