Tehreek-e-Taliban: పాకిస్థాన్ కు నిద్ర లేకుండా చేస్తున్న తెహ్రీక్ -ఇ - తాలిబాన్...వీళ్ల డిమాండ్ ఏంటి..? భారత్ వీళ్లకు సపోర్ట్ చేస్తోందా..?

by Vennela |

Tehreek-e-Taliban: ఓవైపు పాకిస్తాన్ భారతదేశంతో ఉగ్రవాదం ముసుగులో ప్రమాదకరమైన క్రీడ ఆడుతుంటే, అటు పాకిస్థాన్ కు కూడా అదే ఉగ్రవాదం శత్రువుల మారి, ఆ దేశానికి సవాలు విసురుతోంది.

Tehreek-e-Taliban: పాకిస్థాన్ కు నిద్ర లేకుండా చేస్తున్న తెహ్రీక్ -ఇ - తాలిబాన్...వీళ్ల డిమాండ్ ఏంటి..? భారత్ వీళ్లకు సపోర్ట్ చేస్తోందా..?
X

దిశ, వెబ్ డెస్క్: Tehreek-e-Taliban: ఓవైపు పాకిస్తాన్ భారతదేశంతో ఉగ్రవాదం ముసుగులో ప్రమాదకరమైన క్రీడ ఆడుతుంటే, అటు పాకిస్థాన్ కు కూడా అదే ఉగ్రవాదం శత్రువుల మారి, ఆ దేశానికి సవాలు విసురుతోంది. పాముకు పాలు పోసి పెంచినా, చివరకు అది విషమే ఇస్తుంది కానీ అమృతం ఇవ్వదు అనే సామెత పాకిస్తాన్ విషయంలో నిజం అవుతోంది. ఒకప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదానికి పాకిస్తాన్ ఊపిరి ఊదింది. ఇప్పుడు అదే ఇస్లామిక్ తీవ్రవాదం పాకిస్తాన్ ను నిలువెల్లా దహనం చేస్తోంది.

పాకిస్తాన్ ఈరోజు తెహ్రి కి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ చేతిలో ముప్పు తిప్పలు పడుతోంది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక బలమైన ఉగ్రవాద సంస్థగా మారి పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. మే 9వ తేదీన ఈ సంస్థ జరిపిన దాడిలో ఏకంగా 20 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. ఓవైపు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పాకిస్థాన్కు నిద్రలేని రాత్రులు చూపిస్తున్నాయి.

ఇప్పుడు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పూర్వ పరవాల్లోకి వెళ్లినట్లయితే, ఈ సంస్థ 2007 సంవత్సరంలో ఏర్పడింది. ఇది ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లు వీరికి ప్రేరణ అని చెప్పవచ్చు. వీరి లక్ష్యం ఇస్లామిక్ షరియత్ అమలు చేయడమే. ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంస్థ దృష్టిలో ఇస్లాం వ్యతిరేకంగా పనిచేస్తుందని భావిస్తోంది. పాకిస్తాన్ పూర్తిగా అమెరికా అదేవిధంగా ఇతర పశ్చిమ దేశాల చేతుల్లో కీలుబొమ్మగా ఈ సంస్థ భావిస్తుంది. వీరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలకు స్వతంత్ర హోదా కావాలని కూడా పోరాటం చేస్తున్నారు.

గతంలో బ్రిటిష్ పరిపాలనలో పాకిస్తాన్ వాయువ్య ప్రాంతం అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజన తెగలకు. Frontier Crimes Regulation (FCR) అనే బ్రిటిష్ కాలం నాటి ప్రత్యేక చట్టం ద్వారా స్వతంత్ర హోదా ఉండేది. ఆ తర్వాత పాకిస్తాన్ ఏర్పడిన అనంతరం ఈ ప్రాంత స్వతంత్ర హోదాను కొనసాగిస్తూ FATA (Federally Administered Tribal Areas) ప్రత్యేక జాతీయ స్వయం పాలిత గిరిజన ప్రాంతాలుగా గుర్తించింది. 1947 నుంచి 2018 వరకు ఈ హోదా కొనసాగింది.

2018లో సభ్యత్వ సవరణ చట్టం ద్వారా FATAను ఖైబర్ పఖ్తూన్ ఖ్వా రాష్ట్రంలో విలీనం చేయడంతో అసలు వివాదం మొదలైంది. అప్పటివరకు ఆ గిరిజన ప్రాంతాల్లోని స్థానిక నేతలకు స్వతంత్రంగా హక్కులు ఉండేవి. అయితే FCRను రద్దు చేసి, పాకిస్తాన్ యొక్క సాధారణ చట్టాలను వర్తింపచేయడంతో స్థానిక గిరిజన నేతలకు హక్కులు దూరం అయ్యాయి. ఇది కూడా తెహరీక్ ఈ తాలిబాన్ సంస్థకు ప్రజల నుంచి వస్తున్న మద్దతుకు కారణం అని చెప్పవచ్చు.

అయితే ఈ ఉగ్రవాద సంస్థకు భారత్ సహకారం అందిస్తోందని పాకిస్తాన్ పలుమార్లు ఆరోపణ చేసింది. భారత నిఘా విభాగం రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)కు సహకరిస్తోందని పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. అయితే అంతర్జాతీయంగా మాత్రం భారత్ ఎలాంటి ఉగ్రవాద సంస్థలకు సహకారం చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.

Next Story