- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్ బోర్డర్‌లో అనుమానిత డ్రోన్... హైటెన్షన్ వైర్‌ను ఢీకొట్టి..!
గుజరాత్ బోర్డర్‌లో అనుమానిత డ్రోన్ కలకలం రేపింది...

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) కొనసాగుతున్న వేళ గుజరాత్(Gunrat) బోర్డర్‌లో అనుమానిత డ్రోన్(Drone ) కలకలం రేపింది. 5 నుంచి 6 అడుగుల పొడవు ఉన్న డ్రోన్.. కచ్ జిల్లా ఖాడ్డా(Kutch District Khavda)లోకి ప్రవేశించింది. హైటెన్షన్ వైర్(High Tension Wire)ను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. దీంతో గుజరాత్(Gujarat) బలగాలు డ్రోన్ శిథిలాలను పరిశీలించాయి. ‘ఈ డ్రోన్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చింది..?’ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా భారత్, పాకిస్థాన్ మధ్య విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గుజరాత్‌లో హై అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, ఎయిర్ పోర్టులు మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. బోర్డర్‌లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ బోర్డర్‌లోకి డ్రోన్ రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






