Supreme court: వెళ్లి క్షమాపణలు చెప్పు.. కర్నల్‌ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్‌

by Prasad Jukanti |   (  Updated:2025-05-15 06:58:53  IST  )

కల్నల్ ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

Supreme court: వెళ్లి క్షమాపణలు చెప్పు.. కర్నల్‌ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: కల్నల్ సోఫియా ఖురేషిపై (Colonel Sophia Qureshi) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షాను (Minister Vijay Shah) సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా మందలించింది. ఆయన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని అనుచితమైనవిగా సీజేఐ బీఆర్ గవాయ్ అభివర్ణించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు బాధ్యత ఉండక్కర్లేదా? తమ ప్రసంగంలో సంయమనం పాటించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్నల్ సోఫియాకు క్షమాపణలు చెప్పాలని కాస్త వివేకం చూపించాలని మండిపడింది. ఆపరేషన్ సిందూర్ కు (Operation Sindoor) సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషీ దేశ ప్రజలకు మీడియా ద్వారా వివరిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెపై మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత, ఆ రాష్ట్ర మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖరేషీని ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో మంత్రి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు మంత్రిపై ఎఫ్ఐఆర్ చేయాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశఇంచింది. ఈ రోజు సాయంత్రంలోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేకుంటే కోర్టు దిక్కారం కింద డీజీపీపై కేసు పెట్టాల్సి వస్తుందని కోర్టు ఆదేశించి. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై స్పందించిన సీజేఐ మంత్రి తీరుపై మండిపడ్డారు. ఈ పిటిషన్ ను రేపు విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు.. ప్రస్తుతానికి అతనిపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

Next Story