- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: ఎల్ఓసీ వెంబడి పాక్ కాల్పులు.. జవాన్ సహా 13 మంది మృతి
ఆపరేషన్ సిందూర్ పేరుతో పహెల్గాం ఉగ్రదాడికి భారత్ బదులిచ్చినా పాక్ బుద్ధి మారడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి (Line of Control) సరిహద్దులు దాటి కాల్పుల ఉల్లంఘనకు పాల్పుడుతూనే ఉంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ పేరుతో పహెల్గాం ఉగ్రదాడికి భారత్ బదులిచ్చినా పాక్ బుద్ధి మారడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి (Line of Control) సరిహద్దులు దాటి కాల్పుల ఉల్లంఘనకు పాల్పుడుతూనే ఉంది. వరుసగా 14వ రోజు దాయాది సైన్యం కవ్వింపులు కొనసాగియి. గురువారం కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి. అయితే, బుధవారం అర్ధరాత్రి శత్రుసైన్యం జరిపిన కాల్పుల్లో జవాను మృతి చెందాడు. పాక్ షెల్లింగ్‌లో గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ శర్మ చనిపోయినట్లు వైట్ నైట్ కోర్ గురువారం ప్రకటించింది. ఇకపోతే, మంగళవారం అర్ధరాత్రి నుంచి పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జవాను సహా మొత్తం 13 మంది భారత పౌరులు (Civilians Killed) మృతిచెందగా.. 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. మరణించిన వారిలో నలుగురు చిన్నారులున్నట్లు అధికారులు తెలిపారు.
హర్యానాకు చెందిన సైనికుడు
ఇకపోతే, జమ్మూలోని పూంచ్ వద్ద సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన సైనికుడు దినేష్ కుమార్ శర్మ హర్యనాకు చెందిన వ్యక్తి. ఈ విషయాన్ని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "దేశంలోని ప్రతి పౌరుడు మీ బలిదానం పట్ల గర్వపడుతున్నాడు. ఈ దేశం మీ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోదు. ఈ బలిదానం పట్ల నేను సెల్యూట్ చేస్తున్నాను" అని రాసుకొచ్చారు. మరోవైపు, ఏప్రిల్ 22న పహెల్గాంలో ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఆపరేషన సిందూర్ పేరుతో మే 7న తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 వరకు త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ దాడులు చేపట్టాయి. మొత్తం 9 టెర్రర్ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్రస్థావరాలపై 24 మిస్సైళ్లతో మెరుపు దాడి చేసి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఈ దాడిలో 70 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.






