- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్.. రాజకీయ నాయకుల వల్లే భారత్-పాక్ గొడవలు.. షారుఖ్ ఖాన్ వీడియో వైరల్
బాలీవుడ్ బాద్‌షాగా ఎదిగిన షారుఖ్ ఖాన్‌కు ఇండియాలో ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పుట్టినరోజున ఆయన ఇంటి ముందు నిరీక్షించే అభిమానులు ఎంతో మంది.. ఆయన ఐకానిక్ పోజ్ కోసం వెయిట్ చేసే ఆరాధకులు ఇంకెంతోమంది.

దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ బాద్‌షాగా ఎదిగిన షారుఖ్ ఖాన్‌కు ఇండియాలో ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పుట్టినరోజున ఆయన ఇంటి ముందు నిరీక్షించే అభిమానులు ఎంతో మంది.. ఆయన ఐకానిక్ పోజ్ కోసం వెయిట్ చేసే ఆరాధకులు ఇంకెంతోమంది. కానీ ఆయనకు పాకిస్తాన్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే భారత్-పాక్ వార్ టైమ్‌లో షారుఖ్ నోరు మెదపలేదు. ఎవరికి సపోర్ట్‌గా పోస్ట్ పెడితే ఎవరు హర్ట్ అవుతారోనని ఆ జోలికే పోలేదు. దీంతో ఇండియన్స్ హర్ట్ అయ్యారు. దేవుడిలాగా కొలిచే స్టార్ కనీసం స్పందించకపోవడంపై బాధపడిపోయారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. షారుఖ్ పాక్‌కు చెందినోడని తెలుపుతోంది.
ఈ వీడియోలో మాట్లాడుతున్న షారుఖ్.. తన తండ్రి పాకిస్తాన్ కరాచీకి చెందినవాడు కావడం గర్వంగా ఉందన్నాడు. అయినా భారతీయులు, పాకిస్తానీయులకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని.. రాజకీయ నాయకుల వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పాడు. పాలిటిక్స్ ఆ లెవల్‌కు వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయన ఇక్కడెందుకు ఉండాలి మరి అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈయన అక్కడోడు కాబట్టే రియాక్ట్ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






