- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్: ఏడుగురు లోక్‌సభ నేతలతో ప్రతినిధుల బృందాలు.. ఎందుకంటే..?
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత ప్రభుత్వం పార్లమెంటు సభ్యులతో ఏడు బృందాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా భారత ప్రభుత్వం పార్లమెంటు సభ్యులతో ఏడు బృందాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వాస్తవాలను, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారతదేశం చేపట్టిన ఖచ్చితమైన దాడులను ఇతర దేశాలకు వివరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ చర్యలు భారతదేశం సంయమనంతో, ఉగ్రవాద లక్ష్యాలపై మాత్రమే దృష్టి సారించి నిర్వహించినవని నొక్కి చెప్పనున్నారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశం నిరంతర పోరాటం నేపథ్యంలో, ఏడుగురు అఖిలపక్ష ప్రతినిధులు ఈ నెల చివర్లో UN భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామి దేశాలను సందర్శించనున్నారు. ఈ ఏడుగురు ప్రతినిధుల బృందాలకు ఈ క్రింది పార్లమెంటు సభ్యులు నాయకత్వం వహిస్తారు
1) శశిథరూర్, కాంగ్రెస్
2) రవిశంకర్ ప్రసాద్, బిజెపి
3) సంజయ్ కుమార్ ఝా, జెడియు
4) బైజయంత్ పాండా, బిజెపి
5) కనిమొళి కరుణానిధి, డీఎంకే
6) సుప్రియా సులే, ఎన్‌సిపి
7) శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, శివసేన
ఈ ఏడుగురు సభ్యులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ బృందలోని ఒక్కో సభ్యుడు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. వీరు పాక్ ఉగ్ర కుట్రలను అన్ని దేశాలకు తెలిసేలా వివరించనున్నారు. కాగా అమెరికాకు శశిథరూర్ నేతృత్వంలో బృందం వెళ్లనుంది. అలాగే తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం వెళ్లనుంది. ఈ నెల 22, 23 న వీరి పర్యటన ఉండనుంది.






