- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-Pakistan tensions: ఉద్రిక్తతల వేళ న్యూఢిల్లీలో సౌదీ మంత్రి ఆకస్మిక పర్యటన
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇలాంటి వేళ సౌదీ అరేబియాకు చెందిన మంత్రి ఆకస్మికంగా ఢిల్లీలో పర్యటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇలాంటి వేళ సౌదీ అరేబియాకు చెందిన మంత్రి ఆకస్మికంగా ఢిల్లీలో పర్యటించారు. సాదీ విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్ మంత్రి అదెల్ అల్ జుబైర్ ఢిల్లీకి వచ్చారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో చర్చలు జరిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సౌదీ మంత్రితో భేటీ జరిగింది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఎక్స్‌వేదికగా పోస్టు చేశారు. ‘‘సౌదీ అరేబియా మంత్రి అదెన్ అల్ జుబైర్‌తో సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత్ దృక్పథాలను ఆయనకు వివరించాను’’ అని జైశంకర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇరాన్ మంత్రితో..
మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్ఛితో మన విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు. ఇప్పటికే భారత్-పాక్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు తాము సిద్ధమని ఇరాన్ వెల్లడించింది. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘‘ఈ క్లిష్ట సమయంలో ఇస్లామాబాద్- న్యూఢిల్లీలోని దౌత్య కార్యాలయాల సహకారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తాం. సోదరుల్లాంటి పొరుగుదేశాలే మాకు అత్యున్నత ప్రాధాన్యం’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే పాకిస్థాన్ ను అరాగ్ఛి సందర్శించారు. అక్కడి నాయకులతో చర్చించి.. తిరిగి ఇరాన్‌కు వెళ్లారు. ఆ తర్వాత న్యూఢిల్లీకి వచ్చారు.






