Sania Mirza: దేశ ఐక్యతకు నిదర్శనం! ఆపరేషన్ సిందూర్ పై ‘సానియా మీర్జా’ శక్తివంతమైన సందేశం

by Ramesh Naini |   (  Updated:2025-05-08 05:52:56  IST  )

ఇద్దరు మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ అమలు చేసిన విధానంపై మీడియాకు వివరించిన విషయం తెలిసిందే.

Sania Mirza: దేశ ఐక్యతకు నిదర్శనం! ఆపరేషన్ సిందూర్ పై ‘సానియా మీర్జా’ శక్తివంతమైన సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇద్దరు మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ అమలు చేసిన విధానంపై మీడియాకు వివరించిన విషయం తెలిసిందే. ఇద్దరు మహిళా అధికారులను చూసి దేశ ప్రజలు గర్వపడుతున్నారు. దేశవ్యాప్తంగా అధికారులపై చర్చ మొదలైంది. వివిధ మతాలకు చెందిన ఇద్దరు మహిళా అధికారులపై దేశ ప్రజలు ప్రశంసలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ పై భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) స్పందించారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పోస్ట్ చేశారు. (Colonel Sophia Qureshi) కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమిక (Wing Commander Vyomika Singh) చేసిన బ్రీఫింగ్‌కు ప్రతి స్పందనగా ఈ దేశ ఐక్యతకు సరైన నిదర్శనం అంటూ ఫొటోలను ఆమె పంచుకున్నారు.

‘ఈ శక్తివంతమైన ఫోటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’ అని సానియా మీర్జా తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక, 38 ఏళ్ల మీర్జా, భారత దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి. టెన్నిస్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నారు. మీర్జా 2015లో ప్రపంచంలో నంబర్ 1 డబుల్స్ క్రీడాకారిణిగా ర్యాంక్ పొందారు. కాగా, భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అమలు గురించి బుధవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా మట్టుబెట్టింది.

Next Story