- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాకు కామన్స్ సెన్స్ లేదా నువ్వొచ్చి చెప్పాలా..ట్రంప్ ట్వీట్ పై ఆర్జీవీ సెటైర్

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ కాల్పులు విరమించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్రంప్ ఓ ట్వీట్ కూడా చేశారు. ఒక రాత్రంతా ఇరు దేశాలతో అమెరికా మాట్లాడిందని చెప్పారు. తాను రిక్వెస్ట్ చేసిన తరవాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. కామన్ సెన్స్ మరియు తెలివి ఉపయోగించినందుకు రెండు దేశాలకు అభినందనలు తెలిపారు.
కాల్పుల విరమణపై దృష్టి పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ట్రంప్ ట్వీట్ పై ఆర్మీవీ సెటైరికల్ కామెంట్ చేశాడు. అంటే నువ్వు చెప్పకుంటే మాకు కామన్ సెన్స్ కానీ తెలివి కానీ లేవా? నువ్వు వచ్చి మాకు నేర్పిస్తున్నావా? అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు తమ స్టైల్‌లో స్పందిస్తున్నారు. ఆర్జీవీ సెటైరిక్‌గా చెప్పినా ట్రంప్ మాటలు అలాగే ఉన్నాయని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు ఇప్పుడు నీ ట్వీట్లు అవసరమా అంటూ మండిపడుతున్నారు.