- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో రెడ్ అలర్ట్.. ఆపరేషన్ సిందూర్‌పై హోంమంత్రి అమిత్ షా పోస్ట్
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత ఆర్మీ 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా చేసిన మెరుపు దాడులపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత ఆర్మీ 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా చేసిన మెరుపు దాడులపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ కింద ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం తీసుకున్న చర్యల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ లో పోలీస్ విభాగం రెడ్ అలర్ట్ (Red Alert in UP) ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ పోలీసులలోని అన్ని ఫీల్డ్ ఫార్మేషన్లు రక్షణ దళాలతో సమన్వయం చేసుకుని ముఖ్యమైన స్థావరాల భద్రతను బలోపేతం చేయాలని యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) మయాంక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో విమానాశ్రయాలను మూసివేశారు. పాఠశాలలు సైతం మూతపడ్డాయి. పంజాబ్ సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్ పూర్, పఠాన్ కోట్, ఫాజిల్కా, అమృత్ సర్, గురుదాస్ పూర్ లలో బుధవారం స్కూళ్లను మూసివేశారు. రాజస్థాన్ లోని బికనీర్, జోధ్ పూర్ విమానాశ్రయాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
మరోవైపు భారత్ దాడులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) స్పందించారు. భారత్, ప్రజలపై దాడిచేస్తా నరేంద్రమోదీ ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుందని Xలో పోస్ట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత ఆర్మీ (Indian Army), ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు ఆపరేషన్ సిందూర్ ను చేపట్టాయని వెల్లడించారు. ఆర్మీ బలగాలను చూస్తుంటే గర్వంగా ఉందని అందులో పేర్కొన్నారు.






