Operation Sindoor: పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ మరో సంచలన హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-08 11:23:40  IST  )

ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కీలక ప్రకటన చేశారు.

Operation Sindoor: పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ మరో సంచలన హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కీలక ప్రకటన చేశారు. హైక్వాలిటీ పరికరాలతో భారత బలగాలు దాడులు చేశాయని అన్నారు. దాడుల్లో అమాయక ప్రజలకు నష్టం జరుగకుండా జాగ్రత్తపడినట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు(Terrorists) హతమయ్యారని అన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని తెలిపారు. పీవోకేలో ఉగ్రవాదులను వేటాడుతున్నట్లు వెల్లడించారు. మరిన్ని దాడులకు భారత్ సిద్ధంగా ఉందని.. పాక్ వక్రబుద్ధి మానుకోవలని హెచ్చరిక చేశారు.

మరోవైపు పాకిస్తాన్‌(Pakistan)లోని కీలక నగరాలపై భారత్(India) దాడులు జరిపింది. ఇస్లామాబాద్‌, లాహోర్, రావల్పిండిలోని పాక్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేశారు. S-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్‌ను భారత్‌ నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాక్‌ తెచ్చుకున్న HQ9 క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది.

ఈ క్రమంలో పాక్‌లోని అమెరికన్ ఎంబసీ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. లాహోర్ వీడాలని తమ పౌరులకు అమెరికా సూచనలు చేసింది. ఉద్రిక్తతల వేళ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా ఆదేశించింది.

Next Story