సీఎం రేవంత్ కు రాజాసింగ్ లేఖ.. వాళ్ళను తరిమేయండి

by velandi.Saikiran |   (  Updated:2025-05-10 13:34:00  IST  )

తెలంగాణ ( Telangana) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ( Cm revanth reddy) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Rajasingh) లేఖ రాశార

సీఎం రేవంత్ కు రాజాసింగ్ లేఖ.. వాళ్ళను తరిమేయండి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ( Telangana) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ( Cm revanth reddy) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Rajasingh) లేఖ రాశారు. హైదరాబాద్-పాతబస్తీలో ( Hyderabad-Old Town ) చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ వలసదారులపై ( Illegal immigrants ) వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ లిఖితపూర్వక వినతి పత్రం పంపారు. అలాంటి వ్యక్తులను గుర్తించి వీలైనంత త్వరగా వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు రాజాసింగ్.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... అక్రమ చొరబాటుదారులను ఇప్పుడే వెళ్లగొట్టాలని రాజాసింగ్ పేర్కొన్నారు. అలా అయితేనే తెలంగాణను కాపాడుకోగలుగుతామని... సూచనలు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని.. కోరారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న తరుణంలోనే ఈ పనిపై దృష్టి పెట్టాలని సూచనలు చేశారు రాజాసింగ్.






Next Story