Posters: పహల్గాం టెర్రర్ అటాక్ ఎఫెక్ట్.. జమ్మూలో పోస్టర్ల కలకలం!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-13 07:05:25  IST  )

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam)లో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Posters: పహల్గాం టెర్రర్ అటాక్ ఎఫెక్ట్.. జమ్మూలో పోస్టర్ల కలకలం!
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam)లో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ మారణ హోమాన్ని తలుచుకుని యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది టూరిస్టులు తమ కుటుంబ సభ్యుల ఎదుటే నిర్ధాక్షిణ్యంగా బుల్లెట్లకు బలయ్యారు. మరణించిన వారిలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు.

ఈ క్రమంలోనే కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు జమ్మూకశ్మీర్ సర్కార్ (Jammu Kashmir Government) వినూత్న ఆలోచన చేసింది. ఉగ్రవాదుల గురించి సమాచారం అందిస్తే భారీ పారితోషికం ఇస్తామంటూ షోపియన్ జిల్లా (Shopian District)లో అధికారులు పోస్టర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పహల్గాం (Pahelgam) అటాక్‌లో పాల్గొన్న వారి వివరాలు చెబితే ఏకంగా రూ.20 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అక్కడి అదికారులు ప్రజలకు భరోసానిస్తున్నారు.

Next Story