- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ దాడిలో పూంచ్ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది: సీఎం ఒమర్ అబ్దుల్లా
కశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి.. 26 మందిని దారుణంగా కాల్చి చంపారు.

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి.. 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం (War atmosphere) నెలకొంది. భారత పర్యాటకులపై దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆర్మీ పీఓకే, పాక్ లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి.. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇరు దేశాల ఉద్రిక్తతలు తీవ్రమైన విషయం తెలిసిందే. కాగా పాక్ సైన్యం ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అలాగే డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు చేశారు. ఈ దాడుల్లో స్థానికులు మృతి చెందారు.
కాగా పాక్ దాడిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. " 3-4 రోజులు జమ్మూ కశ్మీర్‌లో యుద్ధం లాంటి వాతావరణం ఉంది. పాకిస్థాన్ కాల్పుల వల్ల పూంచ్ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది. పాక్ కాల్పుల్లో 13 మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. నేను ఇక్కడికి వచ్చి బాధితుల ఇళ్లను సందర్శించాను. ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా సోదరభావాన్ని కాపాడుకునేందుకు పూంచ్ ప్రజలకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరిగితే.. ఇలాంటి భారీ నష్టాలను నివారించడానికి పౌర సమాజం నుండి మాకు సూచనలు వచ్చాయి" స్థానిక ప్రజల సూచనలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తాము అని" సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.






