ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తాం.. మరోసారి హెచ్చరించిన ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |

పంజాబ్(Punjab) పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ(PM Modi) వాయుసేన(Air Force)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తాం.. మరోసారి హెచ్చరించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్(Punjab) పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ(PM Modi) వాయుసేన(Air Force)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరంతా చరిత్ర సృష్టించారు.. పాక్‌కు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సత్తా చూపించారు. వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమవుతుంది. ఇప్పుడు నాక్కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అణ్వాయుధాలను చూపి పాక్ బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకుంది. ఏమాత్రం బెదరకుండా అణుబాంబు హెచ్చరికలను భారత్‌ చిత్తు చేసింది.. భారత్‌ మాతాకీ జై అనే నినాదంతో శత్రువులకు నిద్ర లేకుండా చేసింది. భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది.. భవిష్యత్‌ కాలానికి మీరు ప్రేరణగా నిలుస్తారు. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి నా సెల్యూట్.. ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నారు.. ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీ వెంట ఉన్నాయి.. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది.. ఆపరేషన్‌ సిందూర్‌ సాధారణమైన సైనిక విన్యాసం కాదు.. ఇది భారతదేశ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మనదేశ ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేస్తే.. ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తామని మరోసారి హెచ్చరించారు. కాగా, మంగళవారం పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌ను ప్రధాని మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా సైనికులతో కాసేపు ముచ్చటించారు. యుద్ధంలో వీరోచిత పోరాటం చేశారని సెల్యూట్ చేశారు. ఆర్మీ సరిహద్దుల్లో, గగనతలంలో వాయుసేన, సముద్రంలో నేవీ సిబ్బంది సాహసం అందరినీ గర్వపడేలా చేసిందని కొనియాడారు.

Next Story