- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దయచేసి భారత్ నుంచి మమ్మల్ని కాపాడండి: పార్లమెంటులో పాకిస్తాన్ ఎంపీ ఆవేదన
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam terror attack) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో పాక్, పీఓకేలో 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam terror attack) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో పాక్, పీఓకేలో 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత్‌పై పాక్ సైన్యం వరుస దాడులకు పాల్పడుతుండగా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలనూ ధ్వంసం చేశాయి.
అయితే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఎంపీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సదరు ఎంపీ భారత్ నుంచి తమ దేశాన్ని కాపాడాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఎంపీ, విశ్రాంత సైనికాధికారి మేజర్ తాహిర్ ఇక్బాల్ పార్లమెంటులో మాట్లాడుతూ.. తమ దేశం చాలా బలహీనంగా ఉందని, అందుకే తమని కాపాడాలని దేవుడిని వేడుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని, దేవుడి దయ ఉంటే విజయం సాధిస్తామన్నారు. కాగా, భారత్ నుంచి వరుస పరాభవాలు ఎదురవుతున్న వేళ పాకిస్థాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను ఈ వీడియో చాటుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- Latest news
- Telugu news
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






