- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్‌వోసీ వెంట పిన్ డ్రాప్ సైలెన్స్.. ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత నియంత్రణ రేఖ (LOC) వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత నియంత్రణ రేఖ (LOC) వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. కౌంటర్ అటాక్‌గా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పీవోకే, పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు చేసి నెలమట్టం చేసింది. అనంతరం సరిహద్దులో పాక్ సైన్యం విచ్చలవిడిగా భారత పోస్టులపై కాల్పులకు తెగబడింది. శనివారం ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందంతో దాదాపు 19 రోజుల తరువాత LOC వెంట పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపించింది. ఆదివారం రాత్రి సరిహద్దులో ఎక్కడా ఎలాంటి కాల్పులు జరగలేదని ఇండియన్ ఆర్మీ (Indian Army) అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇప్పుడే ఎవరూ స్వస్థలాలకు వెళ్లొద్దని సరిహద్దు గ్రామాల ప్రజలను జమ్మూకశ్మీర్ అధికారులు హెచ్చరించింది. పేలని షెల్స్ ఇంకా ఉంటాయని, వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంద తెలిపారు.
మా యుద్ధ విమానం ధ్వంసమైంది.. పాక్ ఆర్మీ
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో భాగంగా పాక్‌కు చెందిన యుద్ధ విమానాలను నేలకూల్చామని భారత్ సైన్యం తెలిపింది. ఈ క్రమంలోనే ఆ విషయంపై పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధ (Pakistani Lieutenant General Ahmed Sharif Chaudhary) స్పందించారు. తమ ఫైటర్ జెట్ ఒకటి ధ్వంసమైన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ, ఆ నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలను బయటపెట్టకపోవడం గమనార్హం.






