S-400 ధ్వంసం అంటూ పాక్‌ ప్రచారం.. రక్షణ శాఖ కీ స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |

ఇండియన్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ S-400పై భారత రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది.

S-400 ధ్వంసం అంటూ పాక్‌ ప్రచారం.. రక్షణ శాఖ కీ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ S-400పై భారత రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మీడియాలో తాము S-400‌ను ధ్వంసం చేసినట్లుగా ప్రత్యర్థి పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. అవన్ని ఉత్త మాటలేనని.. S-400‌ను ఎవరూ ధ్వంసం చేయలేరని పేర్కొంది. మరోవైపు సరిహద్దుల్లో పాక్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని భారత సైన్యం తెలిపింది. అమృత్‌సర్‌ ఖాసా కంటోన్మెంట్‌ పరిధిలో పాక్‌ సైన్యం డ్రోన్ బాంబులను ప్రయోగించింది. ఆయితే అప్రమత్తమైన భద్రతా దళాలు వాటిని గాల్లోనే బ్లాస్ట్ చేసినట్లుగా తెలిపింది. అదేవిధంగా సాధారణ పౌరులపై పాక్ దాడులు చేయడం హర్షించే విషయం కాదని.. ఎట్టి పరిస్థితుల్లో వారికి సరైన జవాబు ఇస్తామని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Next Story