భారత వెబ్‌సైట్లపై పాక్ హ్యాకర్ల దాడులు.. మహారాష్ట్ర సైబర్ విభాగం కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత భారతదేశంలోని కీలక మౌలిక సదుపాయాలైన వెబ్‌సైట్ల (Websites)పై పాక్ హ్యాకర్లు 15 లక్షలకు పైగా సైబర్ దాడులు, ఏడు అడ్వాన్స్‌డ్ పర్సిస్టెంట్ థ్రెట్ (Advanced Persistent Threat) గ్రూప్‌లను మహారాష్ట్ర సైబర్ విభాగం గుర్తించింది.

భారత వెబ్‌సైట్లపై పాక్ హ్యాకర్ల దాడులు.. మహారాష్ట్ర సైబర్ విభాగం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత భారతదేశంలోని కీలక మౌలిక సదుపాయాలైన వెబ్‌సైట్ల (Websites)పై పాక్ హ్యాకర్లు 15 లక్షలకు పైగా సైబర్ దాడులు, ఏడు అడ్వాన్స్‌డ్ పర్సిస్టెంట్ థ్రెట్ (Advanced Persistent Threat) గ్రూప్‌లను మహారాష్ట్ర సైబర్ విభాగం గుర్తించింది. అయితే, ఈ దాడుల్లో కేవలం 150 ఎటాక్స్ మాత్రమే ప్రభావం చూపాయని అధికారులు వెల్లడించారు. అనంతరం సైబర్ డిపార్ట్‌మెంట్ హెడ్ మాట్లాడుతూ.. భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ.. పాక్ హ్యాకర్లు బంగ్లాదేశ్, ఇండోనేషియా, మొరాకో ఇతర ప్రాంతాల నుంచి భారత ప్రభుత్వ వెబ్‌సైట్లపై ఇంకా సైబర్ దాడులు చేస్తున్నారని తెలిపారు.

ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హ్యాకర్లు డేటాను దొంగిలించారని పేర్కొన్నారు. ఏవియేషన్, మున్సిపల్ డిపార్ట్‌మెంట్ సిస్టమ్‌లను హ్యాక్ చేశారని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ (Election Commission) వెబ్‌సైట్‌ను టార్గెట్ చేశారని వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. భారత ఆర్మీ ఉద్రవాద శిబిరాలపై జరిపిన దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అని నామకరణం చేయగా.. పాక్ హ్యాకర్ల కుట్రలను తప్పి కొట్టేందుకు రాష్ట్ర నోడల్ సైబర్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ‘రోడ్ ఆఫ్ సిందూర్’ ('Road of Sindoor') పేరుతో సైబర్ యుద్ధం చేశామని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

Next Story