దిల్ సుఖ్ నగర్ లో పాకిస్థాన్ జెండా..కాళ్లతో తొక్కి మరీ

by velandi.Saikiran |

పాకిస్తాన్ ( Pakisthan ) వర్సెస్ ఇండియా ( India) మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో... భారతదేశ వ్యాప్తంగా పాకిస్తాన్ కు వ్

దిల్ సుఖ్ నగర్ లో పాకిస్థాన్ జెండా..కాళ్లతో తొక్కి మరీ
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ( Pakisthan ) వర్సెస్ ఇండియా ( India) మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో... భారతదేశ వ్యాప్తంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అనవసరంగా ఇండియాతో పాకిస్తాన్ పెట్టుకుందని భారతీయులు చురకలు అంటిస్తున్నారు. అవసరమైతే పాకిస్తాన్ పై దాడి చేసేందుకు మేము కూడా వస్తామని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. పాకిస్తాన్ కు సంబంధించిన జెండాలను కూడా దగ్ధం చేస్తున్నారు.

అయితే తాజాగా.. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఓ జెండాను ( Pakisthan flag)... నడి రోడ్డుపై వేశారు స్థానిక ప్రజలు. అనంతరం.. ఆ పాకిస్తాన్ జెండాపై నుంచి నడిచి, నిరసన తెలిపారు. చిన్నపిల్లలయితే... చెప్పులతో పాకిస్తాన్ జెండాను తొక్కుతూ అవమానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన దిల్ సుఖ్ నగర్ లోని మెట్రో స్టేషన్ దగ్గరే జరిగింది.

Next Story