- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : పాక్ కాల్పులు... LOC గ్రామాలను ఖాళీ చేయిస్తున్న ఆర్మీ
కశ్మీర్లోని LOC వద్ద సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులు(Pak Firing) జరపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కశ్మీర్లోని LOC వద్ద సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులు(Pak Firing) జరపుతోంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే 15 మంది పౌరులు మృతి చెందగా.. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులను తిప్పి కొడుతూనే ఇండియన్ ఆర్మీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎల్‌వోసీ వెంట ఉన్న గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు భద్రతా బలగాల అధికారులు. కాగా భారత ఆర్మీ(Indian Army) మంగళవారం అర్థరాత్రి "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 100 మంది ముష్కరులను అంతమొందించింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు.
అయితే ఈ అకస్మాత్తు చర్యతో ఏం చేయాలో తెలియని పాక్.. సాధారణ భారత పౌరులపై రెచ్చిపోయి కాల్పులకు తెగబడింది. LOC వెంట బుధవారం పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది భారత పౌరులు మరణించగా.. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ వార్త వెలువడిన అనంతరం పూంచ్(Poonch), తంగ్ధర్ సెక్టార్ల(Tangdhar Sectors)లో పాక్ బలగాలు సామాన్య ప్రజలే టార్గెట్ గా కాల్పులకు పాల్పడుతుండగా.. పూంచ్, యూరీ, రాజోలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.






