Pakistan -Modiistan : పాకిస్తాన్‌పై ఇండియా గెలుపు.. పాక్ యువకుడి సంచలన కామెంట్స్.. మోదీస్తాన్ రాష్ట్రం అంటూ షాకింగ్ వీడియో రిలీజ్

by Sujitha Rachapalli |   ( Updated:2025-05-10 07:34:17.0  )
Pakistan -Modiistan : పాకిస్తాన్‌పై ఇండియా గెలుపు.. పాక్ యువకుడి సంచలన కామెంట్స్.. మోదీస్తాన్ రాష్ట్రం అంటూ షాకింగ్ వీడియో రిలీజ్
X

దిశ, ఫీచర్స్ : భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. ఐక్య రాజ్య సమితి శాంతించమని కోరుతోంది. చైనా, బంగ్లాదేశ్ తప్ప మిగతా అన్ని దేశాలు భారత్‌కు సపోర్ట్‌గా చేరుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాకిస్తాన్-అమెరికన్ యువకుడి వీడియో వైరల్ అవుతోంది. ఉగ్రవాదులను ఏరేస్తున్న భారత్‌కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు. పాక్ మీద భారత్ కచ్చితంగా గెలుస్తుందని.. పాకిస్తాన్ పూర్తిగా ఇండియాలో చేరిపోతుందని.. అప్పుడు ఏర్పడిన ప్రావినెన్స్‌కు మోదీస్తాన్‌గా పేరు పెట్టాలని.. ఆ రాష్ట్రానికి నేనే ఫస్ట్ సీఎం అవ్వాలని కోరుకున్నాడు. అందుకు తగిన అర్హతలు తనకున్నాయని.. అప్పుడు ఉగ్రవాదులను ఎట్ల కొడుతానంటే.. టెర్రరిస్ట్ అనే పేరు ఎత్తేందుకే భయపడేలా చేస్తా అని చెప్పుకొచ్చాడు.

దీనిపై స్పందిస్తున్న ఇండియన్స్.. అలా చెప్పు.. తప్పకుండా మోదీస్తాన్ వస్తుందని అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఆ పాకిస్తాన్ బురద మాకెందుకు బాబు అని చిరాకు పడుతున్నారు. అయితే పాకిస్తానీయులు దారుణంగా రియాక్ట్ అయ్యారు. పాక్ ప్రజల మధ్యకు వచ్చావంటే ఒక్క రోజు కూడా బతకలేవని హెచ్చరిస్తున్నారు.

Click For Tweet..



Next Story

Most Viewed