- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: సీఎం యోగి ఇలాకాలో దారుణం.. ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌తో రెచ్చిపోయిన పాక్ మద్దతుదారులు
పాక్‌పై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌తో పాకిస్థాన్ మద్దతు దారులు రెచ్చిపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : పాక్‌పై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌తో పాకిస్థాన్ మద్దతు దారులు రెచ్చిపోతున్నారు. ఇండియన్స్‌పై దాడికి పాల్పడుతున్నారు. అది కూడా మన దేశంలోనే కావడం గమనార్హం. యూపీలో కొందరు యువకులు పాకిస్థాన్‌ను ఓడించండి అంటూ ఓ బాలుడు నినాదాలు చేశాడని కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడి పరిస్థితి విషమంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌తో యూపీలోని షాజహాన్‌పూర్‌లో ప్రజలు సంబురాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఈ క్రమంలో ధరమ్‌గడపూర్‌కు చెందిన 8 ఏళ్ల సుర్జీత్ ‘పాకిస్థాన్‌ను ఓడించండి’ అంటూ నినాదాలు చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన కాట్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిగోహి, వసీం ఖాన్ నిగోహి రోడ్, పువయ్య ప్రాంతాలకు చెందిన పాక్ మద్దతుదారులు మోహిత్ ఖాన్, వసీంలు కలిసి సుర్జీత్‌పై కత్తితో దాడి చేశారు. బాలుడిని విచక్షణ రహితంగా పొడిచారు. దాడిని గుర్తించిన స్థానికులు వెంటనే ఆ ఇద్దరిని పట్టుకుని చితకబాదారు. సుర్జీత్‌ను హాస్పిటల్‌కు తరలించి నిందితులు ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. కాగా, యోగి సీఎంగా ఉన్న రాష్ట్రంలో పాక్ మద్దతు దారులు రెచ్చిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.






