పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌ను పొట్టుపొట్టు తిట్టిన ఎంపీలు..వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-10 07:15:50  IST  )

భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఫరీఫ్‌కు నిరసన సెగ తగులుతోంది. గురువారం పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలు ప్రధానిపై,

పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌ను పొట్టుపొట్టు తిట్టిన ఎంపీలు..వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఫరీఫ్‌కు నిరసన సెగ తగులుతోంది. గురువారం పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలు ప్రధానిపై, ఆర్మీ చీఫ్ పరువుతీస్తూ పొట్టుపొట్టు తిట్టారు. ఓ ఎంపీ మాట్లాడుతూ... షెహబాజ్ షరీఫ్ పిరికివాడు అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ సూక్తి చెబుతూ... ఒక సమూహానికి పులి నాయకత్వం వహిస్తే ఆ సమూహంలోని పిల్లులు కూడా పులులు అవుతాయని, అదే పిల్లి నాయకత్వం వహిస్తే పులులు కూడా పిల్లుల్లా మారిపోతాయని మండిపడ్డారు.

దేశం కోసం పోరాడుతున్న పాకిస్థాన్ సైనికులు తమ నాయకుడు షరీఫ్ ధైర్యంగా పోరాడాలని అనుకుంటున్నారని, కనీసం భారత ప్రధాని నరేంద్రమోడీ పేరు కూడా చెప్పలేని పిరికి నాయకుడు ఉంటే సరిహద్దులో పోరాడుతున్న పాక్ సైనికులకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు అని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో మీరూ మీరూ కొట్టుకుచావండిరా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదీ పాకిస్థాన్ పరిస్థితి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Click For Tweet..

Next Story