- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్.. రెండు ముక్కలు?
చెరపకురా చెడేవు.. అన్నట్లుగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. పహెల్గాం దాడితోనే ఆ దేశానికి కౌంట్ డౌన్ మొదలైనట్లు విశ్లేషణ

- ఇటు భారత సైన్యం, అటు బీఎల్ఏ దాడులతో కకావికలం
- పాక్ కబంధ హస్తాల నుంచి విముక్తికి ఇదే తరుణమని భావిస్తున్న బీఎల్ఏ?
దిశ, వెబ్ డెస్క్: చెరపకురా చెడేవు.. అన్నట్లుగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. పహెల్గాం దాడితోనే ఆ దేశానికి కౌంట్ డౌన్ మొదలైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇండియాతో పోరాటానికి పాక్ సైన్యం రంగంలోకి దిగగానే.. అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరో సవాల్ ఎదురైంది. భారత్, బలూచిస్తాన్ దాడులతో పాక్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైంది.
పాకిస్తాన్ లో అత్యంత విలువైన సహజ వనరులు కలిగిన ప్రాంతమే బలూచిస్తాన్. పాక్ పాలకుల పక్షపాత వైఖరి కారణంగా దశాబ్దాల కిందటే బలూచిస్తాన్లో వేర్పాటువాదం వేళ్లూనుకుంది. పాక్ పాలకులు తమను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేస్తున్నారనేది వేర్పాటువాదుల వాదన. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పేరుతో ఏర్పాటైన దళం.. ఇటీవలి కాలంలో పాక్ సైన్యంపై భారీ దాడులకు పాల్పడుతోంది.
భారతదేశ భీకరదాడిని ఎదుర్కోలేక పాక్ కకావికలం అవుతున్న వేళ.. గురువారం రాత్రి ఆరు పాక్ సైనిక స్థావరాలపై బీఎల్ఏ దాడి చేసింది. పాక్ ఇపుడు దుర్బలస్థితిలో ఉండడం బీఎల్ఏకు కలిసొచ్చింది. పాక్ నుంచి తాము విముక్తి పొందడానికి ఇంతకుమించిన తరుణం రాబోదని బీఎల్ఏ నాయకులు విశ్వసిస్తున్నట్లు సమాచారం.
ఇటు ఇండియన్ ఆర్మీ, అటు బీఎల్ఏ దాడులతో.. ప్రాణాలపై తీపితో పాక్ నేతలు, సైనికాధికారులు విదేశాల్లో తలదాచుకునే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం.






