Operation Sindoor : వైష్ణోదేవి ఆలయంపై పాక్ డ్రోన్ ఎటాక్ !

by Muthe.Rajitha |   (  Updated:2025-05-10 19:03:37  IST  )

గత 3 రోజులుగా జరిగిన భారత్ పాక్ యుద్ధానికి(India Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందంతో ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే.

Operation Sindoor : వైష్ణోదేవి ఆలయంపై పాక్ డ్రోన్ ఎటాక్ !
X

దిశ, వెబ్ డెస్క్ : గత 3 రోజులుగా జరిగిన భారత్ పాక్ యుద్ధానికి(India Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందంతో ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే.అయితే ఆచరణలో మాత్రం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని 3 గంటలైనా గడవకముందే మరోసారి డ్రోన్లు, కాల్పులతో విరుచుకుపడి పాక్ తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంది. కాగా జమ్ము కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు దిగింది. అయితె కొంతమంది స్థానికుల కథనాల ప్రకారం.. జమ్ములోని కత్రలో గల వైష్ణోదేవి ఆలయం(Vaishmodevi Tenple) మీదుగా జరిపిన డ్రోన్ ఎటాక్ ను ఆర్మీ ఎదుర్కొని కూల్చివేసిందని తెలుస్తోంది. అనంతరం కత్రలో బ్లాక్ ఔట్ విధించారు.

అలాగే నాగ్రోటా(Nagrota) సైనిక స్థావరం సమీపంలో అనుమానితుల కదలికలు గుర్తించి.. సైన్యం కాల్పులు జరపగా... అటువైపు నుంచి కూడా కాల్పుల జరిపినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో ఆర్మీ బేస్ సిబ్బందికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారని... కాల్పులు జరిపిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. పాక్ మరోసారి కాల్పులకు, డ్రోన్ దాడులకు దిగడంతో జమ్ము కశ్మీర్ తోపాటు సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్ ఔట్ విధించారు.

Next Story