పాక్ దాడులపై ఈయూతో మాట్లాడిన జైశంకర్.. ఇక రాజీపడేది లేదు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-08 19:45:41  IST  )

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

పాక్ దాడులపై ఈయూతో మాట్లాడిన జైశంకర్.. ఇక రాజీపడేది లేదు!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ (ఇండియా-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (ఆపరేషన్ sindoor) పేరుతో దాడులు చేపడితే.. పాకిస్థాన్ దీనికి ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత్‌పై వరుస దాడులకు పాల్పడుతోంది. జమ్మూ క‌శ్మీర్, పంజాబ్, రాజ‌స్థాన్‌లోని ప‌లు ప్రాంతాల్లో డ్రోన్ దాడుల‌తో పాటూ మిస్సైల్స్‌తో దాడి చేసింది. వీటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ (Blackout) ప్రకటించారు. అలాగే, జమ్ము, జైసల్మేర్, జలంధర్, అమృత్‌సర్ ప్రాంతాల్లో ప్రత్యర్థి పాక్‌ దాడికి పాల్పడకుండా పవర్ కట్ చేశారు.

ఇక ఈ ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) యూరోపియన్ యూనియన్ (EU) ఉపాధ్యక్షుడు కజాకల్లాస్‌తో మాట్లాడారు. భారత్-పాక్ మధ్య తాజా పరిస్థుతుల్ని వారికి వివరించారు. భారత్ ఇప్పటివరకు ఎంతో సంయమనం పాటించిదని, కానీ తన భద్రత విషయంలో మాత్రం రాజీ పడదని మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ చర్యలను ఉపేక్షించేది లేదని, చాలా గట్టిగా బదులు చెప్పబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Next Story