Democracy: ప్రజాస్వామ్య లక్షణం అదే.. పాక్ కు భారత్ కౌంటర్

by Shamantha N |

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయయి. కాగా.. ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్‌ ఆర్మీ ప్రతినిధి అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది.

Democracy: ప్రజాస్వామ్య లక్షణం అదే.. పాక్ కు భారత్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయయి. కాగా.. ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్‌ ఆర్మీ ప్రతినిధి అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. “బహిరంగ విమర్శలే ప్రజాస్వామ్యానికి ముఖ్య లక్షణం.. పాక్ కు అది పరిచయం లేదు” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ కు కౌంటర్ ఇచ్చారు. ఇటీవలే అహ్మద్ షరీఫ్ చౌదరి మిడయాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. కొందరు భారత పౌరులు, రాజకీయనాయకులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ కేంద్రానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఆయన ఎత్తిచూపారు. కాగా.. దీనిపై విక్రమ్ మిస్రీ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. "వివిధ అంశాలపై ప్రజలు భారత ప్రభుత్వాన్ని విమర్శించాలనే వాస్తవం పట్ల పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పౌరులు తమ సొంత ప్రభుత్వాన్ని విమర్శించడం చూడటం ఆ దేశానికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, ఏదైనా బహిరంగ విమర్శలు చేయడం అసలైన ప్రజాస్వామ్య లక్షణం. పాక్ కు దానితో పరిచయం లేదనే విషయం ఆశ్చర్యం కలిగించటం లేదు. అందుకే మీకు ఆ విషయం తెలీదు" అని దాయాదికి చురకలు అంటించారు.

పశ్చిమ సరిహద్దుల్లో పాక్ దాడులు

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఘర్షణలపై విదేశాంగశాఖ, మిలిటరీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ (MEA Briefing) నిర్వహించారు. దీనిలో విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ (Vikram Misri), కర్నల్‌ సోఫియా ఖురేషీ (Sofia Qureshi), వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ (Vyomika Singh) పాల్గొన్నారు. సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘పశ్చిమ సరిహద్దుల్లో పాక్‌ నిరంతరం దాడులు చేస్తోంది. డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్‌ మ్యూనిషన్‌, ఫైటర్‌ జెట్లను వాడి.. భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. అయితే వాటిని భారత్‌ తిప్పికొట్టింది. ఇది రెచ్చగొట్టే చర్య అని కచ్చితంగా తెలుస్తోంది’’ అని మండిపడ్డారు. భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్‌ స్టాంప్‌లు ఉన్న వీడియోలు, ఫొటోలను వ్యోమికా సింగ్‌ ప్రదర్శించారు. విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మాట్లాడుతూ.. ‘శిర్సా, సూరత్‌ఘర్‌ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామనడం అవాస్తవం. అదంపుర్‌లోని ఎస్‌-400 , బ్రహ్మోస్‌ మిసైల్‌ డిపో, పలుచోట్ల ఎయిర్‌ఫీల్డ్‌లను ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మొద్దని సూచించారు.

Next Story