- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OperationSindoor: న్యాయం ఇక్కడ యూనిఫాం ధరిస్తుందంటూ మహేశ్ బాబు ట్వీట్
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం అయింది. బవహల్పూర్‌లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఆర్మీ దాడులు జపరగా.. దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అంతే కాకుండా.. ఇప్పటి వరకు ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిగాయని.. ఎక్కువ చేస్తే న్యూ ఇండియాను చూస్తారని ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌ను హెచ్చరించారు.
దీంతో ప్రస్తుతం ఇండియన్ ఆర్మిమై సోషల్ మీడియా వేదికగా.. ప్రశంసలు కురిపిస్తున్నారు భారతీయులు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కూడా స్పందించగా.. తాజాగా దీనిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ.. ‘న్యాయం ఇక్కడ యూనిఫాం ధరిస్తుంది.. ఇది మేము నిలబడే భారతదేశం.... మేరా భారత్ మహాన్. మన యోధులకు సెల్యూట్! #ఆపరేషన్ సిందూర్’ అంటూ ట్వీట్ చేశారు.






