Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

by Prasad Jukanti |

ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. ఇంకా కొనసాగుతోందని ఇవాళ ఐఎఎఫ్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత వైమానిక దళానికి అప్పగించిన పనులను అత్యంత కచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా నిర్వర్తించామని, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించామని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్‌పై ఊహాగానాలు నమ్మొద్దని సైనిక చర్యలు కొనసాగుతున్నందున సమయానుకూలంగా ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని వాయుసేన ట్వీట్ చేసింది. మరో వైపు ప్రధాని మోడీతో త్రివిధ దళాధిపతుల సమావేశం కొనసాగుతోంది. నిన్న భారత్, పాకిస్తాన్ చేసిన సీజ్ ఫైర్ ఒప్పందం, ఆ వెంటనే పాక్ ఉల్లంఘనకు పాల్పడిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ముగిశాక రక్షణ, విదేశాంగ శాఖ కీలక వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

Next Story