- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌లో మన తెలుగు తేజం కీలక పాత్ర
"రాకెట్‌మ్యాన్"గా గుర్తింపు పొందిన సతీష్‌రెడ్డి సక్సెస్ స్టోరీ ఇది.

"ఆపరేషన్ సిందూర్"..
పాకిస్తాన్ కుట్రను తిప్పికొట్టడమే కాదు..
"స్వదేశీ సాంకేతిక" శక్తినీ చాటుకొని..
ఆత్మనిర్భర్ కలను నిజం చేసింది.
ఈ ఘనతలో "తెలుగు సైంటిస్ట్" కృషి దాగివుంది.
ఆయనెవరో కాదు..
డీఆర్డీడీఓ మాజీ చైర్మెన్ డాక్టర్ సతీష్ రెడ్డి.
"రాకెట్‌మ్యాన్"గా గుర్తింపు పొందిన సతీష్‌రెడ్డి సక్సెస్ స్టోరీ ఇది.
- దిశ, ఫీచర్స్
"ఆపరేషన్ సిందూర్"లో బ్రహ్మోస్.. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ప్రయోగించి విజయవంతం చేశారు. డాక్టర్ సతీష్ రెడ్డి కీలకపాత్రలో వీటి ప్రయోగం జరిగింది. "రాకెట్‌మ్యాన్"గా గుర్తింపు పొందిన సతీష్.. భారత రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి "ఆత్మనిర్భర్ భారత్" కలను సాకారం చేశాడు.
సతీష్ కీలక పాత్ర..
మే 7.. 2025న సాయుధ దళాలు "ఆపరేషన్ సిందూర్"ను ప్రారంభించాయి. పాకిస్తాన్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇది సాగింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ "స్వేదీశీ సాంకేతిక శక్తి"ని ప్రపంచానికి చాటింది. అందుకే ఇదొక "ఆత్మనిర్భర యుద్ధం". డీఆర్‌డీఓ.. దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చేసిన "యాంటీ డ్రోన్ సిస్టమ్స్" పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా నిరోధించాయి. "బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్" క్షిపణి కచ్చితమైన.. నమ్మకమైన ఆయుధంగా రుజువైంది. బ్రహ్మోస్ ప్రయోగం వెనకాల డాక్టర్ సతీష్ రెడ్డి కృషి దాగివుంది.
డీఆర్‌డీఓ ఖ్యాతి
"బ్రహ్మోస్ క్షిపణి" భారత్- రష్యా ఉమ్మడి సంస్థ అయిన "బ్రహ్మోస్ ఏరోస్పేస్" ద్వారా తయారైంది. సముద్రం.. భూభాగం.. గాల్లో నుంచి లాంచ్ చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అంతేకాదు.. 300 కిలోమీటర్ల పరిధిలో శత్రు రక్షణ వ్యవస్థల్ని ఛేదించగల శక్తి దీనికి ఉంది. ఆకాష్ క్షిపణి.. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వంటి స్వదేశీ వ్యవస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి.. డీఆర్డీఓ ఖ్యాతిని చాటి చెప్పాయి.
ఏంటీ బ్రహ్మోస్.?
బ్రహ్మోస్ కేవలం ఒక ఆయుధం మాత్రమేకాదు. ఇదొక "భారత రక్షణ శక్తికి" సందేశం. ఆత్మనిర్భర భారత్‌కు నిదర్శనం. రక్షణ రంగంలో "మిసైల్స్"ను విదేశాల నుంచి కొనుగోలు చేయకుండా మనమే తయారుచేసి.. అభివృద్ధి చేయడమే ఈ ఆత్మనిర్భర భారత్. దీనిని మరింత విస్తరింపజేయాలని 2025.. మే 11న యూపీలోని "డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్"లో "బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్"ను ప్రారంభించారు రక్షణమంత్రి రాజనాథ్ సింగ్. 22 ఎకరాల్లో.. ఏటా 100-150 క్షిపణులను తయారుచేస్తారిక్కడ. ఇందులో "బ్రహ్మోస్- ఎన్‌జీ" కూడా ఉంది. ఎన్‌జీ అంటే నెక్ట్స్ జనరేషన్.
తెలుగు స్ఫూర్తి
బ్రహ్మోస్ వంటి "ఆత్మనిర్భర భారత్" ప్రాజెక్టుల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ "ఆపరేషన్ సిందూర్" దెబ్బను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన వారిలో ఒకరైన సతీష్ రెడ్డిది నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన అసాధారణ ప్రతిభ.. కఠోర శ్రమతో భారత రక్షణ రంగంలో చెరగని ముద్రవేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ డెవలప్మెంట ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) మాజీ చైర్మెన్‌గా.. రక్షణమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా స్వదేశీ రక్షణ సాంకేతికతలతో ఇండియా శక్తిని.. తెలుగు స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పాడు.
మొదటి అడుగులు
అనంతపురంలోని జేఎన్టీయూలో ఎలక్ర్టానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు సతీష్ రెడ్డి. తర్వాత హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంఎస్.. పీహెచ్డీ పట్టాలు సాధించాడు. శాస్త్రీయ ఆలోచనలు.. సాంకేతిక ఆవిష్కరణలపై ఆసక్తి ఆయనను చిన్న వయసులోనే పరిశోన రంగంవైపు నడిపించింది. విద్యార్థిగా నిరంతర అభ్యాసం.. సృజనాత్మక కోణంలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం సతీష్ రెడ్డి విజయానికి పునాది వేశాయ. 1986లో హైదరాబాద్‌లోని "డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ" (డీఆర్‌డీఎల్)లో యువ సైంటిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు.
డీఆర్‌డీఓ చైర్మెన్..
ఏపీజే అబ్దుల కలాం స్థాపించిన "రీసెర్చ్ సెంటర్ ఇమారత్"లో నావిగేషన్ సిస్టమ్స్.. ఇనర్షియల్ సెన్సార్స్.. గైడెడ్ వెపన్స్ వంటి కీలక రంగాల్లో పనిచేశాడు సతీష్ రెడ్డి. ఆర్‌సీఐ డైరెక్టర్‌గా "ఐఆర్ సీకర్స్".. "ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ మాడ్యూల్స్" వంటి ఆవిష్కరణలకు నాయకత్వం వహించాడు. 2014లో "డిస్టింగ్విష్డ్ సైంటిస్టు"గా.. 2015లో "రక్షణమంత్రికి శాస్త్రీయ సలహాదారు"గా.. 2018లో "డీఆర్డీఓ చైర్మెన్"గా బాధ్యతలు స్వీకరించాడు. 2020లో పదవీకాలం మరో రెండేళ్లు పొడిగించారు. సతీష్ రెడ్డి నాయకత్వంలోనే డీఆర్డీఓ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేసి భారత్‌ను ఆయుధ ఎగుమతిదారుగా మార్చింది.
అంతర్జాతీయ గుర్తింపు
డాక్టర్ సతీష్ రెడ్డి సహకారం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయనను వరించాయి.
👉 "రాయల్ ఏరోనాటికల్ సొసైటీ" (లండన్) ద్వారా 2019లో గౌరవ "ఫెలోషిప్" పొందాడు. ఇది వరించిన తొలి భారతీయుడు సతీషే.
👉 "అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్" (ఏఐఏఏ) ద్వారా బమిసైల్ సిస్టమ్స్" అవార్డు అందుకున్నాడు.
👉 "ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" తరపున "హోమిజె బాబా మెమోరియల్ గోల్డ్ మెడల్" తీసుకున్నాడు.
👉 స్వదేశీ డిజైన్లలో సహకారానికి గాను.. "నేషనల్ డిజైన్" అవార్డు.. "నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్" అందుకున్నాడు.
👉 2017లో "ఏసియన్ సైంటిస్ట్ 100" జాబితాలో స్థానం లభించింది.
👉 రష్యాలోని "అకాడమీ ఆఫ్ నావిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్"లో విదేశీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్
రక్షణరంగంలో సతీష్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని ఏపీ గవర్నమెంట్ ఆయనను "ఏరోస్పేస్.. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్"కు రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా నియమించింది. "నేషనల్ టెక్నాలజీ డే" సందర్భంగా మే 11న "అకాడమీ ఫర్ సైన్స్.. టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్" (ఏఎస్టీసీ) ఆధ్వర్యంలో గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా సతీష్ రెడ్డి "లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్" అందుకున్నాడు. స్వదేశీ డిజైన్.. అభివృద్ధి.. ఉత్పత్తి ద్వారానే భారత్ నిజమైన ఆత్మనిర్భరత సాధిస్తుందని.. 2027 నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా "గ్లోబల్ లీడర్"గా నిలవాలనేదే ఆయన కల.
- Tags
- rocket man
- drdo ex chairman
- rci ex director
- brahmos
- anti drones system
- dr. satheesh reddy
- apj abdul kalam
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






